Andhra Pradesh: ఏపీలో టీడీపీ, వైసీపీ పొలిటికల్ వార్

Andhra Pradesh: సాయంత్రం 4గంటలకు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు

Sandeep Eggoju
Updated on: 18 Sept 2021 2:10 PM IST
Political War Between YCP and TDP in Andhra Pradesh
X

ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటిల్ హీట్ తారాస్థాయికి చేరింది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దండయాత్రగా వచ్చి దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు అంటున్నారు. అటు వైసీపీ మాత్రం తాము నిరసన తెలపడానికే వచ్చామని, టీడీపీ నేతలే కావాలని తమపై దాడికి దిగారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై ఇప్పటికే టీడీపీ, వైసీపీ ఏపీ డీజీపీకి పరస్పర ఫిర్యాదులు చేశాయి. తమపై దాడి చేశారంటే తమపై దాడి చేశారని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. మరోవైపు ఈ ఘటనను టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story