విశాఖలో రాజకీయ విమర్శలకు దారి తీసిన భూమి ధరలు

విశాఖలో రాజకీయ విమర్శలకు దారి తీసిన భూమి ధరలు
x
Highlights

విశాఖ సాగర తీరంలో భూముల ధరలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. స్మార్ట్ సిటీలో అంగుళం జాగా కొనాలన్నా లక్షలు చెల్లించాల్సిందే అలాంటిది చదరపు అడుగు కేవలం 17 వందల రూపాయలు మాత్రమే అంటూ రాష్ర్ట మంత్రి బొత్స ప్రకటన చేశారు.

విశాఖ సాగర తీరంలో భూముల ధరలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. స్మార్ట్ సిటీలో అంగుళం జాగా కొనాలన్నా లక్షలు చెల్లించాల్సిందే అలాంటిది చదరపు అడుగు కేవలం 17 వందల రూపాయలు మాత్రమే అంటూ రాష్ర్ట మంత్రి బొత్స ప్రకటన చేశారు. అంత తక్కువ ధరకు భూములు ఎక్కడ ఉన్నాయో చూపించాలంటూ టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అధికార ప్రతిపక్ష నేతల మధ్య ల్యాండ్ రేట్ వార్ కొనసాగుతుంది.

విశాఖలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య భూమి ధరలు రాజకీయ విమర్శలకు దారి తీసింది. అందమైన బీచ్ లు, పచ్చని కొండలు, ప్రకృతి వనరులతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకర్శిస్తున్న విశాఖలో రోజు రోజుకు జనాభా విస్తరించింది. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఎందరో ఇక్కడ సెటిల్ అవుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా విశాఖలో భూముల ధరలు పెరుగుతున్నాయి గజం భూమి కొనాలంటే లక్షలు చెల్లించాల్సిందే. 17 వందల రూపాయలకే చదరపు గజం చొప్పున భూములు దొరుకుతున్నాయంటూ స్వయాన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన అందర్ని ఆశ్యర్యంలో ముంచెత్తింది.

విశాఖ సిటీలోని ద్వారకానగర్, సీతమ్మధార, ఎంవీపి, సిరిపురం, మురళీనగర్ వరకు గజం భూమి లక్ష రూపాయల వరకు ఉండగా సింహాచలం, గాజువాక, పెందుర్తి, మాధవధార, మధురవాడ ప్రాంతాల్లో గజం 30 వేల వరకు ధర పలుకుతుంది. విశాఖ నగర శివారు ప్రాంతాలు కొమ్మాది, సబ్బవరం ప్రాంతాల్లో 15 వేల నుండి 20 వేలవరకు వుంది. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో వున్న ఓపెన్ మార్కేట్ ధర. అయితే ఇదే ల్యాండ్స్ ను ప్రభుత్వం గృహాల కోసం, పరిశ్రమల కోసం ప్రత్యేక రేటును ఫిక్స్ చేసి ఇస్తున్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన ప్రకారం విశాఖ సిటీలో చదరపు అడుగు భూమి 16 వందల నుంచి 17 వందల రూపాయలే ఉందంటూ రియల్టర్ రంగం నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఊదరగొట్టారు. మరి విశాఖ మధురవాడలో ఇంత తక్కువ ధరలు ఎక్కడ వున్నాయని చూపించాలంటూ టీడిపి నేతలు విమర్శలు చేస్తూ కౌంటర్ ఇస్తున్నారు.

గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతి చేసిందని మంత్రి బొత్సా ఆరోపించడం ఆ తర్వాత మంత్రి బొత్స చేసిన ప్రకటనకు టీడీపీ నేతలు కౌంటర్ ఇవ్వడంతో ల్యాండ్ రేట్స్ కాస్తా పొలిటికల్ వార్ గా మారింది. రాజకీయ నాయకుల లెక్కలు ఏలా వున్నా విశాఖ లో భూముల అసలు ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయని ఇక సొంత ఇంటికల మాటే లేదన్నది ప్రజల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories