విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదాలతో ఉద్యమిస్తున్న ఉక్కునగరం

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదాలతో ఉద్యమిస్తున్న ఉక్కునగరం
x
Highlights

*ప్రవేటీకరణ వద్దంటూ హెచ్చరికలు *రాజీనామా చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్

ఉక్కునగరం ఉద్యమిస్తోంది. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని నినదిస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జెండాతో పనిలేకుండా సింగిల్‌ ఏజెండాతో అన్ని పార్టీలు కదం తొక్కుతున్నాయి. కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు రోడ్డుమీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కేంద్రం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఏపీలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణయం సెగ‌లు పుట్టిస్తుంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రయివేట్‌పరం చేయకుండా ఆపడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమానికి రాజకీయ పార్టీలు, తెలుగు ప్రజలు సన్నద్ధం అవుతున్నారు. ఈ విషయంలో ఒక్క బీజేపీ తప్పా అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి.

టీడీపీ మరో అడుగు ముందుకు వేసింది. విశాఖపట్నం నార్త్ నియోజక వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తన పదవీకి రాజీనామా చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపించానని వెల్లడించారు. అలాగే విశాఖ ఉక్కు ప‌రిశ్రమను కాపాడేందుకు నాన్-పొలిటిక‌ల్ జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్లు గంటా శ్రీనివాస్‌ ప్రకటించారు.

32 మంది బలిదానాలు, వందలాది మంది నిర్బంధాలు, లక్షలాది మంది ఆందోళనలు.. వారందరీ త్యాగాల ఫలితమే.. విశాఖ ఉక్కు కర్మాగారం.. ఈ ఉక్కు ప్లాంట్‌ 22 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. 17 వేల మంది పర్మినెంట్, 16వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ మెయిన్ గేటు వద్ధ భారత మజ్దూర్ సంఘ్ నిరసన వ్యక్తం చేసింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

గతంలో విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పోరేట్‌ వ్యక్తుల చేత్తుల్లో పెట్టేందుకు కేంద్రం ప్రయత్నించింది. అప్పుడు తీవ్ర విమర్శలు, నిరసనలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్లీ కేంద్రం ఉక్కు పరిశ్రమను ప్రవేటీకరణ చేసేందుకు నిర్ణయించింది. ఈ విషయం తెలియగానే. కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రవేటీకరణకు ఒప్పుకోమని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories