Visakha Garjana: విశాఖలో పొలిటికల్ హీట్..

Visakha Garjana: లక్ష మందితో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన

Jyothi
Updated on: 15 Oct 2022 2:08 PM IST
Political Heat Raise in Vishaka Due to Vishaka Garjana
X

Visakha Garjana: విశాఖలో పొలిటికల్ హీట్.. 

Visakha Garjana: విశాఖలో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఇవాళ ఒక్కరోజే మూడు పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు చేపడుతున్నాయి. లక్ష మందితో నాన్ పొలిటికల్ జేఏసీ... విశాఖ గర్జన నిర్వహిస్తోంది. నాన్ పొలిటికల్ జేఏసీ చేపట్టిన విశాఖ గర్జనకు వైసీపీ మద్దతు తెలిపింది. గర్జన ర్యాలీలో ‎మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉత్తరాంధ్ర వైసీపీ శ్రేణులు పాల్గొననున్నారు. మరో పక్క ఇవాళ విశాఖలో జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. రేపు జరిగే జనసేన జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం జనసేన ముఖ్యనేతలతో పవన్‌కల్యాణ్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు విశాఖలోనే పవన్ మకాం వేయనున్నారు. ఇక నేడు టీడీపీ ఉత్తరాంధ్ర నేతలు సమావేశం నిర్వహించనున్నారు. తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను.. ప్రజల్లోకి తీసుకెళ్లడంపై టీడీపీ నేతలు చర్చించనున్నారు. మూడు పార్టీల కార్యక్రమాలు ఉండటంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరం వ్యాప్తంగా వెయ్యి మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story