విశాఖలో పెరిగిన పొలిటికల్ హీట్
* వెలగపూడి సవాల్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే అమర్‌నాథ్ * ఈస్ట్ పాయింట్ కాలనీలోని సాయిబాబా ఆలయం వరకు ర్యాలీ * సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అమర్‌నాథ్
విశాఖలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ, వైసీపీ సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం రంజుగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి సవాల్‌ను స్వీకరించిన వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్.. ఈస్ట్ పాయింట్ కాలనీలోని షిర్డీ సాయిబాబా ఆలయం దగ్గరకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వెలగపూడి అక్రమాలపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. ఎమ్మెల్యే వెలగపూడి వచ్చి ప్రమాణం చేస్తే.. తాను కూడా ప్రమాణం చేస్తానని అన్నారు అమర్‌నాథ్. మధ్యాహ్నం వరకు వెలగపూడి కోసం ఆలయంలో ఎదురుచూస్తానన్నారు. విజయసాయిరెడ్డికి సవాల్ విసిరే స్థాయి వెలగపూడికి లేదని.. టీడీపీ హయాంలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారో లేదో స్పష్టం చేయాలన్నారు. వెలగపూడి ఆక్రమణలపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు అమర్‌నాథ్.
మరోవైపు.. తనపై ఆరోపణలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి వస్తేనే.. తాను వచ్చి ప్రమాణం చేస్తానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వెలగపూడి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పోలీసులతో పాటు విశాఖ వాసులు ఆందోళన చెందుతున్నారు.
Next Story




