Visakhapatnam: విశాఖలో వేడెక్కిన రాజకీయాలు

Visakhapatnam: సొంత నియోజకవర్గంలో వైసీపీ జాయినింగ్స్‌కు మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమయ్యింది

Sandeep Eggoju
Updated on: 3 March 2021 4:56 PM IST
Political Heat In Visakhapatnam
X

అవంతి శ్రీనివాస్ (ఫైల్ ఇమేజ్)

Visakhapatnam: విశాఖలో రాజకీయాలు వేడెక్కాయి. సొంత నియోజకవర్గంలో వైసీపీ జాయినింగ్స్‌కు మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమయ్యింది. ఇవాళ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా అనుచరుడు కాశీవిశ్వనాథం వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు కానీ మంత్రి అవంతి హాజరుకాకపోవడంపై వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.

కాశీ విశ్వనాథం జాయినింగ్‌ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తుల నిర్ణయం ముఖ్యం కాదని.. పార్టీ బలోపేతమే ము‌ఖ్యమని వ్యాఖ్యానించారు. అయితే గంటా అనుచరుడు విశ్వనాథం వైసీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలను మంత్రి అవంతి శ్రీనివాస్‌ తీవ్రంగా వ్యతిరే కించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story