జూనియర్ పై అంచనాలు పెరుగుతున్నాయా?

జూనియర్ పై అంచనాలు పెరుగుతున్నాయా?
x
Highlights

ఏపీలో చతికిల పడిన టీడీపీకి ఇప్పుడు కొత్త బూస్టప్‌ కావాలా తెలుగు తమ్ముళ్లు కొత్త నాయకత్వం కోరుకుంటున్నారా ఈ ప్రశ్నలన్నింటికీ ప్రకాశం జిల్లా...

ఏపీలో చతికిల పడిన టీడీపీకి ఇప్పుడు కొత్త బూస్టప్‌ కావాలా తెలుగు తమ్ముళ్లు కొత్త నాయకత్వం కోరుకుంటున్నారా ఈ ప్రశ్నలన్నింటికీ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వెలసిన ఫ్లెక్సీ అవుననే సమాధానం చెబుతోంది. టీడీపీ భవిష్యత్‌ను ఆ ఫ్లెక్సీ నిర్ధేశిస్తుందా ఆ పార్టీ కార్యకర్తల స్వరానికి ఆ ఫ్లెక్సీ దృశ్యరూపం కల్పిస్తుందా ఇంతకీ ఆ ఫ్లెక్సీలో ఏముంది. ఆ ఫ్లెక్సీని ఎవరూ తగలించారు.

ఏపీలో ఫ్లెక్సీ రాజకీయాలు నడుస్తున్నాయి. తమ అభిమాన నాయకుడి ఫోటో లేకుంటే సొంత పార్టీ ఫ్లెక్సీ అయినా బూడిద కావాల్సిందే ఇంకా కొన్ని చోట్ల ఓ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను మరో పార్టీ కార్యకర్తలు లాగేసి, చించేసి కాల్చేస్తారు. అవతల పార్టీ నేతలు గుస్సై పోలీస్‌ స్టేషన్ల మెట్లు ఎక్కుతారు. ఇలా ఏపీలో రాజకీయాలు ఫ్లెక్సీల చుట్టూ చక్కర్లు కొట్టడం కొత్తేమి కాదు.

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఎన్టీఆర్ అభిమాని పులిమి నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కూడా కలకలం సృష్టిస్తోంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇదంతా బాగానే ఉంది కానీ అందులో నెక్ట్స్‌ సీఎం ఎన్టీఆర్ ట్యాగ్‌ లైన్‌ ఇచ్చేశాడు. ఈ లైనే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో మెయిన్‌ ట్రాక్‌ గా మారింది.

ప్రకాశం జిల్లాలో ఈ ఫ్లెక్సీ పెద్ద దుమారమే లేపుతోంది. టీడీపీలో చంద్రబాబు తర్వాత బలమైన నాయకుడు ఎవరని ప్రశ్నిస్తే ఆ పార్టీ నేతలు టక్కున జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తారు. ఎన్టీఆర్ ఒక్కడే టీడీపీని గట్టెక్కించగలడని వారి నమ్మకం 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైనప్పుడు ఎన్టీఆర్ అవసరం పార్టీకి చాలా ఉందని చాలామంది నేతలు బహిరంగంగా చర్చించుకున్నారు. పార్టీ పూర్వవైభవం ఎన్టీఆర్ తోనే సాధ్యమని ప్రకటనలు కూడా చేశారు.

నిజానికి ఏపీలో వైసీపీ జోషు కనిపిస్తోంది. టీడీపీ చతికలపడే పరిస్థితికి చేరుకుంది. ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన మళ్లీ తెరపైకి రావడంతో టీడీపీ కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు. ఫ్లెక్సీలపై చిన్నరాముడు ఫోటోలతో పాటు టీడీపీ నేతల ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇతర పార్టీల కార్యకర్తలు మాత్రం అత్యుత్సాహమని కొట్టిపారేస్తున్నారు. కొన్నాళ్లుగా టీడీపీలో నాయకత్వ మార్పుపై గట్టిగానే చర్చ సాగుతోంది. నాయకత్వ మార్పు జరగాల్సిందేనని కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు పెట్టడం ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories