Atchannaidu: ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ లేదు.. భూ సేకరణ కూడా జరగలేదు

Atchannaidu: ఈనెల 29న యువగళం పాదయాత్ర ప్రారంభకానుంది

Shekhar G
Updated on: 26 Sept 2023 8:15 PM IST
Political Action Committee Meeting At TDP State Office
X

Atchannaidu: ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ లేదు.. భూ సేకరణ కూడా జరగలేదు

Atchannaidu: అమరావతిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పోలిటికల్‌ యాక్షన్‌ కమిటీ భేటీ అయ్యింది. ఢిల్లీ నుంచి జూమ్‌లో నారా లోకేష్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానంపై పోరాడేందుకు టీడీపీ-జనసేన నేతలతో కలిసి జేఏసీ ఏర్పాటుకు నిర్ణయించినట్లు ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు తెలిపారు. దీనిపై జనసేనతోనూ కో-ఆర్డినేట్‌ చేసుకుంటానమన్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ లేదు.. భూ సేకరణ కూడా జరగలేదన్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో సంబంధం లేని లోకేష్‌పై కేసు నమోదు చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈనెల 29న రాత్రి 8 గంటలకు యువగళం పాదయాత్ర ఎక్కడ ఆగిందో..అక్కడి నుంచే ప్రారంభంకానున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story