Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు

Bandaru Satyanarayana: మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు

Jyothi
Published on: 2 Oct 2023 11:11 AM IST
Police Surrounded Former Minister Bandaru Satyanarayana Murthy
X

Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు

Bandaru Satyanarayana: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని మాజీ మంత్రి , టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండారు ఇటీవల మంత్రి రోజాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. పరవాడ డీఎస్పీ, సీఐ అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. బండారుకు 41ఏ నోటీసులు జారీ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బండారు ఇంటి వద్దకు చేరుకున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

Jyothi

Jyothi

Next Story