Vijayawada: షర్మిల కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు.. కాన్వాయ్‌ను మధ్యలోనే నిలిపివేసిన షర్మిల

Police Stopped Sharmilas Convoy in Vijayawada
x

Vijayawada: షర్మిల కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు.. కాన్వాయ్‌ను మధ్యలోనే నిలిపివేసిన షర్మిల

Highlights

YS Sharmila: విజయవాడలో వైఎస్‌ షర్మిల ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

YS Sharmila: విజయవాడలో వైఎస్‌ షర్మిల ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. షర్మిల కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. నిడమనూరు వద్ద షర్మిల కాన్వాయ్‌లోని.. వాహనాలను దారి మళ్లించారు. షర్మిల సహా మరో 4 వాహనాలను మాత్రమే.. రామవరప్పాడు మీదుగా వెళ్లేందుకు అనుమతించారు. దీంతో పోలీసుల తీరుపై వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్‌ను మధ్యలోనే నిలిపివేసిన షర్మిల.. తమ వాహనాలను రామవరప్పాడు మీదుగా.. వదిలేంత వరకు వెళ్లేది లేదని బైఠాయించారు. పోలీసులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని.. కావాలనే తమ కాన్వాయ్‌ను దారి మళ్లించారన్నారు. కాంగ్రెస్‌ అంటే వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని కామెంట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories