Jagan: ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసు విచారణ వేగవంతం

Jagan: ఇప్పటికే 6 టీమ్‌లతో వివిధ కోణాల్లో బెజవాడ పోలీసుల దర్యాప్తు

Jyothi
Published on: 15 April 2024 12:01 PM IST
Police Speed Up Investigation In CM Jagan Stone Incident
X

Jagan: ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసు విచారణ వేగవంతం

Jagan: ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ఇప్పటికే ఆరు బృందాలను ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు. తాజాగా మరో 16 టీమ్‌లను ఏర్పాటు చేసి విచారిస్తున్నారు బెజవాడ పోలీసులు. ఒక్కొక్క టీమ్‌లో డీసీపీ, ఏడీసీపీ, డీఎస్పీ ర్యాంక్ అధికారులను నియమించారు బెజవాడ సీపీ.

ఒక్కో టీమ్‌కు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక్కో టీమ్ సిటీలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులను విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న నలుగురు వ్యక్తులను విచారించారు పోలీసులు. కాగా జగన్‌పై దాడి కేసును డీజీపీ, ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story