Yuvagalam: పలమనేరులో లోకేష్‌ ప్రచార వాహనం సీజ్‌..!

Nara Lokesh: చిత్తూరు జిల్లా పలమనేరులో లోకేష్‌ కాన్వాయ్‌లోని ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు.

Arun Chilukuri
Published on: 2 Feb 2023 3:25 PM IST
Police Seized Nara Lokesh Campaign Vehicle
X

Yuvagalam: పలమనేరులో లోకేష్‌ ప్రచార వాహనం సీజ్‌..!

Nara Lokesh: చిత్తూరు జిల్లా పలమనేరులో లోకేష్‌ కాన్వాయ్‌లోని ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. అనుమతి లేకుండా వాహనాన్ని ఉపయోగించారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు.. ప్రచార వాహనాన్ని అడ్డుకోవడంపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాహనాన్ని ఎందుకు సీజ్‌ చేశారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను నారా లోకేష్‌ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1 రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పారు. లోకేశ్‌ నిరసన తర్వాత పోలీసులు ప్రచార రథాన్ని విడిచిపెట్టడంతో ఆయన తిరిగి తన పాదయాత్రను కొనసాగించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story