Tirupathi: తిరుపతిలో భారీగా నగదు పట్టివేత

* ఇరువురు వ్యక్తుల వద్ద రూ.60 లక్షలు స్వాధీనం * సరైన ఆధారాలు లేకపోవడంతో నగదు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్‌

Shilpa
Published on: 2 Nov 2021 7:37 AM IST
Police Seized 60 lakh from two Persons in Tirupati Bus Stand
X

తిరుపతిలో భారీగా నగదు పట్టివేత(ఫైల్ ఫోటో)

Tirupathi: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి 60 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మురళి, భూపతి నగదు కామాక్షి జువెలర్స్‌కి చెందినదిగా చెబుతున్నారు. చెన్నైలో నగలు కొనుగోలు చేయడానికి తరలిస్తున్నట్లు పోలీసులకు తెలియజేశారు. కాగా సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, మురళి, భూపతిని అరెస్ట్‌ చేశారు.

Shilpa

Shilpa

Next Story