రేపు రాజధాని ప్రాంత గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

admin
Published on: 19 Jan 2020 1:23 PM IST
రేపు రాజధాని ప్రాంత గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు
X

రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపధ్యంలో.. అమరావతి ప్రాంతంలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు నిర్వహించకూడదంటూ పోలీసుల ఆంక్షలు విధించారు. చలో అసెంబ్లీ, జైల్‌ భరో కార్యక్రమాలకు అనుమతులు లేవని తెలిపారు. కేబినెట్, అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆందోళనలు చేయొద్దని కోరారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

రాజధాని గ్రామాల్లో ప్రజలు కొత్తవారికి ఆశ్రయం కల్పించొద్దని సూచించారు. కొత్తవారికి ఆశ్రయం కల్పిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అసెంబ్లీ ముట్టడికి సహకరించివారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

admin

admin

Next Story