Visakhapatnam: సీఎం జగన్ విశాఖ టూర్‌లో పోలీసుల ఓవరాక్షన్‌

Visakhapatnam: శ్రీశారదా పీఠం నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు.. సీఎం తిరిగి వెళ్తున్న సమయంలో ప్రయాణికులను అడ్డుకున్న పోలీసులు

Rama Rao
Updated on: 9 Feb 2022 6:46 PM IST
Police Overreaction During CM Jagan Visakhapatnam Tour
X

సీఎం జగన్ విశాఖ టూర్‌లో పోలీసుల ఓవరాక్షన్‌

Visakhapatnam: విశాఖ సీఎం టూర్‌లో పోలీసుల ఓవరాక్షన్‌ చేశారు. శ్రీశారదా పీఠం నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్‌ తిరిగి వెళ్తున్న సమయంలో ప్రయాణికులను అడ్డుకున్నారు. దీంతో.. విశాఖ ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారుల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఎన్‌ఏడీ జంక్షన్‌ దగ్గర వాహనాల నిలిపివేతతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు.. కొత్తవలస నుంచి వచ్చే వాహనాలను పోలీసులు అనుమతించకపోవడంతో.. పెందుర్తి జంక్షన్‌లోను వాహనాలు నిలిచిపోయాయి. ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సిన ప్రయాణికులు.. వాహనాలు దిగి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. పోలీసుల తీరుపై అటు ప్రయాణికులు, స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story