వైసీపీ నేత మోకా హత్య కేసులో కీలక మలుపు.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్‌కు రంగంసిద్ధం

వైసీపీ నేత మోకా హత్య కేసులో కీలక మలుపు.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్‌కు రంగంసిద్ధం
x
Highlights

మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. గత నెల 29న బందరులో భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యారు. చేపల మార్కెట్‌ వద్ద ఓ...

మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. గత నెల 29న బందరులో భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యారు. చేపల మార్కెట్‌ వద్ద ఓ యువకుడు కత్తితో పొడవడంతో దీంతో అతన్ని ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ఘటనా స్థలం నుంచి మరో యువకుడి సాయంతో నిందితుడు బైక్ ఎక్కి పరైనట్టు గుర్తించారు పోలీసులు.

మోకా హత్య కేసుకు సంబంధించి ఇంత వరకూ ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. మోకాను హత్య చేస్తే... ఆ తర్వాత అంతా తాను చూసుకుంటానని కొల్లు రవీంద్ర అభయం ఇచ్చారంటూ నిందితులు వాంగ్మూలం ఇవ్వడంతో కుట్రదారుగా కొల్లు రవీంద్రపై 109 సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. దాంతో, కొల్లు రవీంద్రను నేడు అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories