Andhra Pradesh: ఉద్రిక్తతల నేపధ్యంలో అలర్ట్ అయిన పోలీసులు

Andhra Pradesh: సీఎం జగన్ ఇంటి వైపు వెళ్లే వాహనాల దారిమళ్లింపు

Sandeep Eggoju
Published on: 17 Sept 2021 7:17 PM IST
Police High Alert at CM Jagans Home
X

సీఎం జగన్ ఇందటివద్ద పోలీస్ అలెర్ట్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: టిడిపి అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసిపి శ్రేణులు టిడిపి అధినేత ఇంటిపైకి వెళ్లారు కాబట్టి ప్రతీకారంగా టిడిపి శ్రేణులు సీఎం జగన్ నివాసంవద్ద ఆందోళనకు దిగవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో సీఎం జగన్ నివాసం వైపు వెళ్లే అన్నిదారులను పోలీసులు మూసివేయడమే కాదు దారిపొగవునా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. అంతేకాకుడా సీఎం నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ట్రాఫిక్‌ను జాతీయ రహదారిపైకి మళ్లించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story