Police Duty Meet: తిరుపతిలో ప్రారంభమైన పోలీస్ డ్యూటీ మీట్

Police duty meet * ఆకట్టుకున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఆక్టోపస్ పోలీస్ బలగాల విన్యాసాలు * ఆబ్బుర పరిచిన పోలీసు శునకాల విన్యాసాలు * విన్యాసాలను తిలకించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

Sandeep Eggoju
Published on: 5 Jan 2021 8:36 AM IST
AP Police duty meet at Tirupathi
X

AP Police duty meet

Police duty meet: తిరుపతి లో ప్రారంభమైన పోలీస్ డ్యూటీ మీట్ లో భాగంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఆక్టోపస్ పోలీస్ బలగాలు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు విన్యాసాలు చేపట్టారు. మొదటిరోజు సాయంత్రం విన్యాసలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉగ్రవాదులను చాకచక్యంగా పట్టుకోవడం..వాహనాలను హైజాగ్ చేసి తప్పించుకుని వెళ్ళేటప్పుడు ఏ విధంగా నిందితులను పట్టుకోవాలి.? భవనంలోకి ఉగ్రవాదులు ప్రవేశించినప్పుడు వారిని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియజేస్తూ పోలీసులు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి.

అలాగే పోలీసు శునకాలు చేసిన విన్యాసాలు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రైల్వేస్టేషన్, బస్టాండ్ లాంటి ప్రధాన ప్రాంతాల్లో సూట్ కేసులు, బ్యాగులను వదిలి వెళ్ళిపోతే అందులో మందు గుండు సామగ్రి ఉందా లేదా అని తెలుసుకునేందుకు పోలీసు శునకాలు ఏ విధంగా ప్రయత్నిస్తాయి..? ఉగ్రవాదులను అంతమొందించడంలో శునకాలు పోలీసులకు ఏ విధంగా సహాయపడతాయో తెలియజేసే విధంగా పలు ప్రదర్సనలను నిర్వహించారు. ఎపి డిజిపి గౌతం సవాంగ్ తో పాటు ఇతర పోలీసులు ఉన్నతాధికారులు విన్యాసాలను తిలకించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story