కీచక కానిస్టేబుల్.. ప్రేమజంటలను బెదిరించి యువతులపై అత్యాచారం !

కీచక కానిస్టేబుల్.. ప్రేమజంటలను బెదిరించి యువతులపై అత్యాచారం !
x
కీచక కానిస్టేబుల్
Highlights

రక్షక భటుడే భక్షక భటుడిగా మారాడు. ప్రేమజంటలను బెదిరించి రేప్ లు చేస్తున్నాడు. ఒకసారి కాదు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గతంలో రేప్ కేసులో...

రక్షక భటుడే భక్షక భటుడిగా మారాడు. ప్రేమజంటలను బెదిరించి రేప్ లు చేస్తున్నాడు. ఒకసారి కాదు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గతంలో రేప్ కేసులో సస్పండ్ అయినా అతడి వక్రబుద్ధి మారలేదు. ప్రకాశం జిల్లాలో ఆనంద్ అనే కానిస్టేబుల్ ఖాకీ దుస్తుల ముసుగులో నేరాలకు పాల్పడుతున్నాడు.

గత మంగళవారం ఒంగోలులోని మంగమూరు రోడ్డులోని సమీప ప్రాంతంలోవున్న ప్రేమజంటను కొత్తపట్నం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఆనంద్ బెదిరించాడు. యువతిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. రేప్ చేసిన తర్వాత మంగమూరులో ఆమెను వదిలేసివెళ్లాడు. ప్రియుడు ఫిర్యాదు మేరకు కీచక కానిస్టేబుల్ ఆనంద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్ల క్రితం ఓ ప్రేమ జంటను బెదిరించి యువతిని అత్యాచారం చేశాడు. ఈ కేసులో కానిస్టేబుల్ ఆనంద్ ను సస్పెండ్ చేసి తర్వాత మళ్లీ డ్యూటీలోకి తీసుకున్నారు. కామాంధ కానిస్టేబుల్ ఆనంద్ సోదరుడు సీఐ కావడంతో ఈ కేసును పోలీసులు సీక్రెట్ గా పోలీసులు విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories