JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు..

JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరోసారి కేసు నమోదైంది.

Arun Chilukuri
Published on: 28 Sept 2022 12:23 PM IST
Police Case Filed Against JC Prabhakar Reddy
X

JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు..

JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరోసారి కేసు నమోదైంది. నిన్న తాడిపత్రిలో జేసీ మౌనదీక్ష చేపట్టారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట కుర్చీ వేసుకొని జేసీ మౌనదీక్షకు దిగారు. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా దీక్షలో కూర్చుకున్నారు. వైసీపీ నేతల దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారంటూ ఆరోపిస్తూ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు.

తమ కార్యకర్తలను వైసీపీ నాయకులు దాడి చేసి కొట్టినా డీఎస్పీ వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. డీఎస్పీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో జేసీ తన దీక్షను విరమించారు. అయితే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ జేసీ ప్రభాకర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. జేసీతో పాటు టీడీపీ మున్సిపల్‌ కౌన్సిలర్లు, పార్టీ నేతలపై ఐపీసీ సెక్షన్‌ 143, 188, 341, 353, r/w 149 కింద కేసులు నమోదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story