Amaravati: రాజధాని అమరావతి గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు

Amaravati: రైతులు తలపెట్టిన బైక్ ర్యాలీకి పోలీసుల బ్రేక్‌ * రైతులను బయటికి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు

Sandeep Eggoju
Published on: 8 Aug 2021 10:04 AM IST
Police Break the Farmers Bike Rally in Amaravati
X

అమరావతిలో రైతుల బైక్ ర్యాలీ (ఫైల్ ఇమేజ్)

Amaravati: రాజధాని అమరావతి గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు తలపెట్టిన బైక్‌ ర్యాలీని పోలీసులు అడ్డగించారు. రైతు సంఘాల నాయకులను బయటికి రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అటు రైతులను దీక్షా శిబిరంలోకి సైతం పోలీసులు రానివ్వడం లేదు. అటు రాజధాని సరిహద్దుల్లో బయటి వ్యక్తులకు నో ఎంట్రీ అంటున్నారు పోలీసులు. హైకోర్టు నుంచి మంగళగిరివరకు భారీగా పోలీసులు మోహరించారు. రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story