Vijayawada: విజయవాడలో కాలేజ్‌లు ఖాళీ చేయిస్తున్న పోలీసులు

Vijayawada: విజయవాడలోని కాలేజ్‌లను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.

Arun Chilukuri
Published on: 15 Sept 2023 7:23 PM IST
Police Asks Students to Leave Colleges in Vijayawada
X

Vijayawada: విజయవాడలో కాలేజ్‌లు ఖాళీ చేయిస్తున్న పోలీసులు

Vijayawada: విజయవాడలోని కాలేజ్‌లను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా రోడ్లపై నిరసన తెలిపేందుకు విద్యార్థులు సిద్ధమవడంతో.. విద్యార్థులు రోడ్డెక్కకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. వివిధ కాలేజీల్లోకి వెళ్లిన పోలీసులు.. తరగతులు ఆపేసి విద్యార్థులను పంపించివేశారు. కాలేజీల ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న బెంజ్‌ సర్కిల్‌లో ఐటీ ఉద్యోగుల నిరసన తెలపగా.. విద్యార్థుల వాట్సాప్‌ గ్రూపుల్లో నిరసన చేయాలనే మెసేజ్‌లు సర్కిల్ అవుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలో విద్యార్థులు రోడ్డెక్కకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story