Nimmala Rama Naidu: పోలీసుల అదుపులో టీడీపీ నేత నిమ్మల రామానాయుడు

* కుప్పం మున్సిపల్ ఎదుట ధర్నా చేసిన ఘటనలో అరెస్ట్‌ * 14వ వార్డును అక్రమంగా ఏకగ్రీవం చేశారని ఎస్‌ఈసీకి ఫిర్యాదు

Shilpa
Published on: 10 Nov 2021 9:59 AM IST
Police Arrested TDP Leader Nimmala Rama Naidu on a Complaint by Commissioner Chittibabu Alleging Obstruction of Duty
X

పోలీసుల అదుపులో టీడీపీ నేత నిమ్మల రామానాయుడు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Nimmala Rama Naidu: ఎన్నికల్లో కుప్పం మున్సిపల్‌ కమిషనర్‌ ఏకపక్షంగా వ్యవహరించారని టీడీపీ నేతలు చేపట్టిన నిరసనలు అరెస్ట్‌లకు దారి తీసింది. ధర్నా తెలుపుతున్న ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ మంత్రులు అమరనాథ రెడ్డి, బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విధులకు ఆటంకం కలిగించారని కమిషర్‌ చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ నేతలతోపాటు 19 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

కుప్పంలోని 14వ వార్డును అక్రమంగా ఏకగ్రీవం చేశారని, టీడీపీ అభ్యర్థులు కుప్పంలో లేకపోయినా వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారని టీడీపీ ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసింది. అభ్యర్థుల సంతకాలతో కూడిన లేఖను ఎమ్మెల్సీ ఎస్‌ఈసీకి పంపించారు. అభ్యర్థుల తరపున ఫోర్జరీ పత్రాలు ఎవరు సమర్పించారో సీసీ కెమెరా ఆధారంగా నిగ్గుతేల్చాలని కోరారు.

Shilpa

Shilpa

Next Story