CPI Narayana Arrest: పోలీసుల అదుపులో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

* పోలీసుల అదుపులో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ * తిరుపతి బైరాగిపట్టెడలో వాకింగ్ చేస్తుండగా నారాయణ అరెస్ట్

Shilpa
Updated on: 14 Nov 2021 10:08 AM IST
Police Arrested CPI Narayana in the Wake of Amit Shah Tirupathi Tour
X

పోలీసుల అదుపులో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(ఫైల్ ఫోటో)

CPI Narayana Arrest: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. తిరుపతిలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

దక్షిణ భారత జోనల్ సమావేశం వద్ద నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేస్తామని నారాయణ ప్రకటించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు తిరుపతి బైరాగిపట్టెడ వద్ద వాకింగ్ చేస్తున్న నారాయణను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై నారాయణ అగ్రహం వ్యక్తం చేశారు.

Shilpa

Shilpa

Next Story