చల్లారని కొడాలి నాని కేసినో రచ్చ.. సోము వీర్రాజు సహా పలువురు నేతల అరెస్ట్..

Somu Veerraju: గుడివాడలో కొడాలి నాని కేసినో రచ్చ ఇంకా చల్లార లేదు.

Arun Chilukuri
Published on: 25 Jan 2022 3:51 PM IST
Police Arrest AP BJP chief Somu Veerraju
X

చల్లారని కొడాలి నాని కేసినో రచ్చ.. సోము వీర్రాజు సహా పలువురు నేతల అరెస్ట్..

Somu Veerraju: గుడివాడలో కొడాలి నాని కేసినో రచ్చ ఇంకా చల్లార లేదు. విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పామర్రు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టోల్ గేట్ దగ్గర బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గన్నవరం సమీపంలోని నందమూరు అడ్డరోడ్డు దగ్గర పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీజేపీ శ్రేణులు. పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. 144 వ సెక్షన్ అమల్లో ఉందంటూ పోలీసులు బీజేపీ శ్రేనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story