Polavaram Project: జగన్ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న కాంట్రాక్టర్లు

AP News: పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్ట్ బిల్లులు తక్షణం చెల్లించాలని వేడుకుంటున్నారు సబ్ కాంట్రాక్టర్లు.

Arun Chilukuri
Updated on: 7 Dec 2021 3:58 PM IST
Sub-Contractors are Demanding Immediate Payment of Polavaram Project Sub-Contract Bills
X

పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్ట్ బిల్లులు తక్షణం చెల్లించాలని వేడుకుంటున్నారు సబ్ కాంట్రాక్టర్లు (ఫైల్-ఫోటో)

AP News: పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్ట్ బిల్లులు తక్షణం చెల్లించాలని వేడుకుంటున్నారు సబ్ కాంట్రాక్టర్లు ఇవాళ అమరావతిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని కలసిన సబ్ కాంట్రాక్టర్లు తాము గతంలో ట్రాన్స్ టాయ్ సంస్థకు సబ్ కాంట్రాక్టింగ్ చేసి మోసపోయామని తెలిపారు. పోలవరంప్రాజెక్టు నిర్మాణం కోసం 20 కోట్లు పైనే ఖర్చు చేసినా అప్పటి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయలేదని అప్పటి నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమ చేతిలో మోసపోయామని తెలిపారు.

ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే చావే గతి అంటున్నారు ఆ కాంట్రాక్టర్లు. గతంలో సీఎం జగన్ ను కూడా కలసి తమ పరిస్థితి వివరించి వినతి పత్రం ఇచ్చామని వారంటున్నారు. జగన్ తమ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారని వారంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story