PM Modi: నేడు అమరావతికి ప్రధాని మోదీ రాక.. ఇవాళ్టి మోదీ టూర్ కీలకం

PM Modi: నేడు అమరావతికి ప్రధాని మోదీ రాక.. ఇవాళ్టి మోదీ టూర్ కీలకం
x
Highlights

PM Modi: భారత ప్రధాని మోదీ నేడు ఏపీ రాజధాని అమరావతికి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రాజధాని నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభిస్తారు. గత...

PM Modi: భారత ప్రధాని మోదీ నేడు ఏపీ రాజధాని అమరావతికి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రాజధాని నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభిస్తారు. గత వైసీపీ హయాంలో అమరావతి అభివ్రుద్ధి పనులు అటకెక్కాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ అమరావతినే రాజధానిగా గుర్తించి..పనులు ప్రారంభించింది. అందువల్ల మళ్లీ ప్రధాని మోదీని పిలిపించి ఆయనతో ఈ పనులు ప్రారంభించే విధంగా ప్లాన్ చేసింది కూటమి ప్రభుత్వం. అందువల్ల నేటి మోదీ టూర్ చాలా కీలకంగా మారనుంది. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నేడు రూ. 43, 000కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమం వెలగపూడిలోని సచివాలయం వెనకున్న 300 ఎకరాల స్థలంలో సాయంత్రం 4 గంటలకు జరగుతుంది. ఇందుకోసం అక్కడ పెద్ద సభను ఏర్పాటు చేశారు.

షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ, మధ్యాహ్నం 2.50కి విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో సచివాలయం దగ్గరకు వెళ్తారు. అక్కడి నుంచి కార్యక్రమం జరిగే స్థలానికి వెళ్తారు. సాయంత్రం 3.25 గంటల నుంచి 4.45 గంటల మధ్య శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఈ శంకుస్థాపనలో రూ. 11,240కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ఉద్యోగుల కోసం ఇళ్లు, 320కిలోమీటర్లరవాణా నెట్ వర్క్ 1,281 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. నాగాయలంకలో రూ. 1,460 కోట్లతో మిస్సైల్ టెస్ట్ రేంజ్, విశాఖలో యూనిటీ మాల్, రైల్వే జాతీయ రహదారుల ప్రాజెక్టులు కూడా ప్రారంభం అవుతాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 5లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ చిన్న రోడ్ షోలో కూడా పాల్గొంటారు. అయితే ఈ రోడ్ షో ఉంటుందో లేదో కచ్చితంగా చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం విస్త్రుత ఏర్పాట్లు చేసింది. విజయవాడ, గుంటూరు నుంచి 8 మార్గాల్లో ప్రజలు వచ్చే అవకాశం ఉంది. 11 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. భోజనం, తాగునీరు, మొబైల్ టాయిలెట్స్ , విద్యుత్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. గుంటూరు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ, రాష్ట్ర నోడల్ అధికారి వీరపాండియన్ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories