కర్నూలుకి ప్రధాని మోడీ.. రూ.13,429 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కర్నూలుకి ప్రధాని మోడీ.. రూ.13,429 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
x

కర్నూలుకి ప్రధాని మోడీ.. రూ.13,429 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Highlights

PM Modi: పొదుపు పండుగ పేరుతో సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ వేడుకలు.. ఇక ఈ ఉత్సవాలకు రంగు పులిమెందుకు ఇవాళ కర్నూలు నేలపై అడుగుపెట్టబోతున్నారు ప్రధాని మోడీ.

PM Modi: పొదుపు పండుగ పేరుతో సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ వేడుకలు.. ఇక ఈ ఉత్సవాలకు రంగు పులిమెందుకు ఇవాళ కర్నూలు నేలపై అడుగుపెట్టబోతున్నారు ప్రధాని మోడీ. భారీ బహిరంగ సభకు తరలిరానున్న లక్షలాది మంది ప్రజలు. 13వేల 429 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనలతో కర్నూలు జిల్లా నేటి రోజున చరిత్ర సృష్టించబోతోంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ సంస్కరణలతో ప్రజలపై ధరల భారాన్ని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రంలో ఒక పెద్ద సంబరంగా మారింది. ఇంటి దగ్గర నుంచి కార్యాలయాల వరకు "సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్" నినాదాలు మారుమోగుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజలపై సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల భారం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని నిర్ణయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం.

గత కొన్నిరోజులుగా కర్నూలు, నంద్యాల జిల్లాలు హడావుడిగా కనిపిస్తున్నాయి. భారీ బహిరంగ సభ ఏర్పాట్ల కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల కసరత్తు, ఎక్కడ చూసినా ఏర్పాట్ల జోరు కనబడుతోంది. ఓర్వకల్లు మండలంలోని నన్నూరు చెక్‌పోస్ట్‌ దగ్గర ప్రధాని సభ నిర్వహించబోతున్నారు. సభకు ముందు శ్రీశైలం దివ్యక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోబోతున్నారు ప్రధాని. అదే సమయంలో రాయలసీమ ప్రజలకు పెద్ద బహుమతుల ప్యాకేజ్ అందించనున్నారు. 13వేల 429 కోట్ల విలువైన ప్రాజెక్టులు — శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభివృద్ధిని జాతికిం అంకితం కార్యక్రమాలు అన్నీ ఒకే వేదికపై జరగబోతున్నాయి.

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. కర్నూలులో మకాం వేసిన మంత్రులు, అధికారి బృందాలు సభ విజయానికి అహర్నిశలు పనిచేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో భోజనం నుంచి పార్కింగ్‌ వరకు, నీరు నుంచి ట్రాఫిక్‌ వరకు ప్రతి ఏర్పాటును సమీక్షిస్తున్నారు. సుమారు వివిధ విభాగాలకు చెందిన 9వేల మంది సాయుధ బలగాలతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు.

నేడు కర్నూలు నేలపై అడుగుపెడతారు ప్రధాని నరేంద్ర మోడీ. ముందుగా శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుంటారు. ఆ తరువాత భారీ బహిరంగ సభలో పాల్గొని అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు.కర్నూలు నుంచి మళ్లీ ఢిల్లీ బయలుదేరేంతవరకూ ప్రతి క్షణం రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. పొదుపు పండుగ పేరుతో మొదలైన సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ వేడుకలు. ఇప్పుడు దేశ దృష్టిని ఆకర్షించేలా మారాయి. రాయలసీమ నేలపై నేడు.. అభివృద్ధి దిశగా మరో అడుగు పడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories