తిరుపతిలో పర్యావరణ పరిరక్షణకు సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం

Tirupati: నేటి నుంచి అమలులోకి రానున్న ప్లాస్టిక్ నిషేధం

Jyothi
Published on: 1 Jun 2022 8:26 AM IST
Plastic Ban In Tirupati From Tomorrow
X

తిరుపతిలో పర్యావరణ పరిరక్షణకు సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం

Tirupati: తిరుమలలో పర్యావరణ పరిక్షణ కోసం సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల ఆస్థాన మండపంలో దుకాణాదారులు, హోటళ్ల నిర్వాహకులతో టీటీడీ అధికారులు సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు ప్రకటించారు. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమలకు అనుమతించాలని నిర్ణయించారు.

ప్లాస్టిక్ కవర్లలో వచ్చే ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. పంచెలు, బొమ్మలు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్ కవర్ల ప్యాకింగ్ లేకుండా బయోటి గ్రేడబుల్ కవర్లు లేదా పేపర్ కవర్లు ఉపయోగించాలని సూచిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story