Tirumala: తిరుమలలో మరోసారి కలకలం.. శ్రీవారి ఆలయ సమీపంలో విమానాల చక్కర్లు

Tirumala: ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా విమానాల రాకపోకలు

Shekhar G
Published on: 17 July 2023 4:36 PM IST
Planes Circling Near Srivari Temple
X

Tirumala: తిరుమలలో మరోసారి కలకలం.. శ్రీవారి ఆలయ సమీపంలో విమానాల చక్కర్లు

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో విమానాల చక్కర్లు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఆలయ గోపురం, గొల్లమండపానికి మధ్య ఓ విమానం వెళ్లగా.. ఆలయానికి సమీపంలో నుంచి మరో విమానం చక్కర్లు కొట్టింది. గత కొంత కాలంగా తిరుమల కొండపై తరుచుగా విమానాల రాకపోకలు సాగుతున్నాయి. అయితే.. ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా విమానాల రాకపోకలు జరుగుతున్నాయని టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ.. విమానయాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు.. తరుచూ ఆలయంపై విమానాలు వెళ్తుండటంపై శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story