Vanga Geetha: అస్వస్థతకు గురైన పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత

Vanga Geetha: మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న వంగా గీత

Shashank Gullapelli
Published on: 18 April 2024 10:00 PM IST
Pithapuram YCP Candidate Vanga Geetha  Was Seriously Ill
X

Vanga Geetha: అస్వస్థతకు గురైన పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత

Vanga Geetha: కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా మండుటెండలోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటంతో ఆమె అనారోగ్యం బారినపడ్డారు. మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు వంగా గీత. అయినా బ్రేక్ తీసుకోకుండా ప్రచారం నిర్వహించంతో ఇవాళ ఎఫ్.కే పాలెంలో ప్రచారంలో ఉండగానే అస్వస్థత బారినపడ్డారు. దీంతో ప్రచారాన్ని మధ్యలో ఆపేసి క్యాంపు కార్యాలయంకు వెళ్ళిపోయారు. ఆమెకు వైసీపీ క్యాంపు కార్యాలయంలోనే వైద్యం అందించారు డాక్టర్లు. డిహైడ్రేషన్ కు గురయ్యారని, బీపీ, షూగల్ లెవల్స్ పెరిగాయని తెలిపారు. మరో 48 గంటలు పూర్తి విశ్రాంతి అవసరమని, ఎండలో తిరగరాదని సూచించారు వైద్యులు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story