Pattiseema: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్ లైన్‌ లీక్

Pattiseema: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్ లైన్‌ లీక్ అయింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 July 2024 3:19 PM IST
Pipeline Leakage At Pattiseema Project
X

Pattiseema: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్ లైన్‌ లీక్

Pattiseema: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్ లైన్‌ లీక్ అయింది. మోటర్ల నుంచి డెలివరీ పాయింట్‌కు వెళ్లే మార్గంలో పైప్ లైన్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఎయిర్ వాల్ ప్లేట్ ఊడిపోవడంతో నీళ్లు పైకి ఎగసిపడుతున్నాయి. ఇటీవలే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు నీళ్లు విడుదల చేశారు. ఇవాళ 15 మోటార్లను అధికారులు ఆన్ చేశారు. ఈ క్రమంలోనే పైప్‌ లైన్ లీక్ అయి నీరు వృధాగా పోతుంది.

కాగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్ లైన్ లీకేజిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరా తీశారు. ఈ మేరకు ఆయన సంబంధిత జలవనరుల శాఖ ఇంజినీర్‌లతో నిమ్మల ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే లీకేజిని అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో లీకేజీ నివారించే చర్యలను అధికారులు చేపట్టారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story