Kakinada: కాకినాడ జిల్లా సామర్లకోటలో పందుల పోటీలు

Kakinada: వేట్లపాలెం గ్రామ శివార్లలో పందుల పోటీలను యథేచ్చగా నిర్వహించారు పందెం రాయుళ్లు

Sriveni Erugu
Updated on: 24 July 2022 10:24 AM IST
Pig Competitions at Samarlakota Kakinada District
X

కాకినాడ జిల్లా సామర్లకోటలో పందుల పోటీలు 

Kakinada: కాకినాడ జిల్లా సామర్లకోటలో పందుల పోటీలు ఆసక్తికరంగా సాగాయి. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామ శివార్లలో పందుల పోటీలను యథేచ్చగా నిర్వహించారు పందెం రాయుళ్లు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు సామర్లకోట, వేట్లపాలెం, పెద్దాపురం గ్రామాలకు చెందిన పందెం రాయుళ్లు తరలివచ్చారు. లక్షల్లో పందేలు కట్టి పోటీలను నిర్వహించారు. పందుల పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. అయితే విషయం ఆలస్యంగా పోలీసులకు తెలియడంతో పందెం రాయుళ్లు అక్కడి నుంచి పరార్ అయ్యారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story