దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరల మోత

X
పెట్రోల్ ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
Highlights
* ఢిల్లీ, ముంబై నగరాల్లో పెట్రో ధరలు ఆల్ టైమ్ రికార్డ్ * పెట్రోల్‌పై మరో 22 నుంచి 25 పైసలు పెంపు * డీజిల్‌పై మరో 23 నుంచి 27పైసలు పెంపు
K V D Varma22 Jan 2021 6:36 AM GMT
దేశంలో పెట్రోల్ ధరలు మరోమారు పెరిగి మోత మోగిస్తున్నాయి. రెండ్రోజుల పాటు నిలకడగావున్న పెట్రో ధరలు శుక్రవారం రోజు మరోమారు పెరిగాయి. మెట్రో నగరాల్లో పెట్రోల్ పై 22 నుంచి 25 పైసలు, డీజిల్ పై 23 నుంచి 27పైసలు చొప్పున పెరిగాయి. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆర్దిక రాజధాని ముంబైలోనూ పెట్రో ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిని తాకాయి.
రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటరు ధర 85 రూపాయల మార్క్ ను దాటి పరుగులు తీస్తోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 85 రూపాయల 45 పైసలు, డీజిల్ 75 రూపాయల 63 పైసలు వద్దకు చేరాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 88 రూపాయల 89పైసలు, డీజిల్ ధర లీటర్ 82రూపాయల 53పైసలు వద్ద కొనసాగుతున్నాయి.
Web TitlePetrol Rates Hike in Metro Cities Today 22nd January 2021
Next Story