ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్

YS Jagan: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Arun Chilukuri
Published on: 6 Oct 2021 5:00 PM IST
Petition Over Cancellation of YS Jagan Bail Filed in Telangana High Court
X

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్

YS Jagan: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జగన్ పై ఉన్న 11 ఛార్జి షీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ లో పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరితగతిన జరిగేలా ఆదేశాలివ్వాలని కోరారు. గతంలో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ సీబీఐ కోర్టు కొట్టి వేయడంతో హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ రఘురామకృష్ణరాజు. బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టనున్నది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story