Chittoor: చెరువుకు గండికొట్టారంటూ జాతీయ రహదారిపై ధర్నా

Chittoor: చిత్తూరు జిల్లాలో పేరూరు గ్రామస్తుల ఆందోళన

Sandeep Eggoju
Published on: 26 Nov 2021 7:16 AM IST
Peruru Villagers Protest in Chittoor District
X

చిత్తూరు జిల్లాలో పేరూరు గ్రామస్తుల ఆందోళన (ఫైల్ ఇమేజ్)

Chittoor: చిత్తూరు జిల్లాలో పేరూరు గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. అధికారులు చెరువుకు గండికొట్టడంతో గ్రామంలోకి వరద నీరు వచ్చిందని హైవేపై ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ట్రాఫిక్‌ స్తంభించింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఈ ఘటనలో ఓ మహిళతోపాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని రావద్దంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story