Perni Nani: లోకేష్‌ది పాదయాత్ర కాదు.. జంపింగ్ జపాంగ్‌ యాత్ర

Perni Nani Takes Jibe at Lokesh Padayatra Says it is Jumping Japang
x

Perni Nani: లోకేష్‌ది పాదయాత్ర కాదు.. జంపింగ్ జపాంగ్‌ యాత్ర

Highlights

Perni Nani: టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని.

Perni Nani: టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. లోకేష్‌ది జంపింగ్ జపాంగ్ యాత్ర అని పేర్ని నాని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ యాత్ర చేపట్టారని, లోకేష్‌ది అట్టర్ ఫ్లాప్ షో అని ఆయన వ్యాఖ్యానించారు. లోకేష్‌ యాత్ర కోసం వచ్చి మేనమామ కొడుకు చనిపోతే ఆపలేదు. కానీ, చంద్రబాబు జైలుకు వెళ్తే మాత్రం యాత్రను ఆపేశారు.

ప్రజల కోసం పనిచేసే నాయకుడు సమస్యల పరిష్కారానికి ఆలోచిస్తాడు. యువగళం యాత్ర పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని బూతులు తిట్టారు. రాజకీయ లబ్ధి కోసమే మొక్కుబడి యాత్ర చేశారు. సాయంత్రం సూర్యుడు దిగిపోయాక లోకేష్‌ బయటకు వస్తారు. లోకేష్ యాత్ర చేసిన కిలోమీటర్లన్నీ దొంగ లెక్కలేనని పేర్ని నాని సెటైర్లు వేశారు. రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ యాత్ర చేపట్టారని, లోకేష్‌ది అట్టర్ ఫ్లాప్ షో అని ఆయన వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories