సినిమా సమస్యలపై ఆర్జీవీకి పేర్ని నాని అపాయింట్ మెంట్

Perni Nani: ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్ల వివాదం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది.

Arun Chilukuri
Published on: 5 Jan 2022 6:27 PM IST
Perni Nani Give Appointment to Ram Gopal Varma
X

సినిమా సమస్యలపై ఆర్జీవీకి పేర్ని నాని అపాయింట్ మెంట్

Perni Nani: ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్ల వివాదం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. ఏపీ ప్రభుత్వం, వర్సెస్ ఆర్జీవి మధ్య ట్వీట్ల వార్ జరుగుతోంది. సీన్ లోకి ఆర్జీవి ఎంటరవడంతో ఈ వివాదం మరింత సంచలనంగా మారుతోంది. మంత్రి పేర్ని నాని తనకు అపాయింట్ మెంట్ ఇస్తే కలసి సినీ ఇండస్ట్రీ సమస్యలు చర్చించేందుకు సిద్ధమని ఆర్జీవీ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి పేర్నినాని ఆర్జీవీకి అపాయింట్ మెంట్ ఇచ్చారు.

ఆర్జీవీకి ధన్యవాదాలు.. తప్పకుండా కలసి చర్చిద్దాం అని పేర్నినాని ట్వీట్ చేశారు. అంతకుముందు మంత్రి కొడాలి నాని పై ఆర్జీవీ ఘాటుగా స్పందించారు. కొడాలి వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలని తనను అందరూ అడుగుతున్నారని అయితే కొడాలి నాని ఎవరో తనకు తెలియదని ఆర్జీవి కౌంటర్ ట్వీట్ చేశారు. తనకు తెలిసినది హీరో నాచురల్ స్టార్ నాని మాత్రమేనని అన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story