Perni Nani: రాష్ట్రంలో 11 నుంచి కొత్త కేబినెట్‌.. మంత్రిగా ఇదే చివరి సమావేశం..

Perni Nani: మంత్రివర్గ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి పేర్ని నాని.

Arun Chilukuri
Published on: 5 April 2022 6:21 PM IST
Perni Nani Comments About New Cabinet Minsters
X

Perni Nani: రాష్ట్రంలో 11 నుంచి కొత్త కేబినెట్‌.. మంత్రిగా ఇదే చివరి సమావేశం..

Perni Nani: మంత్రివర్గ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి పేర్ని నాని. ఈ నెల 11 నుంచి కొత్త మంత్రులు వస్తారని క్లారిటీ ఇచ్చారు. బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ, తెలంగాణ బస్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో 'వన్ ఇండియా.. వన్ బస్' వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 11 నుంచి కొత్త కేబినెట్‌ వస్తుందని పేర్నినాని తెలిపారు.

అయితే కొత్త మంత్రివర్గంలో తనకు చోటు ఉంటుందో లేదోనని అనుమానం వ్యక్తం చేశారాయన. రవాణా మంత్రిగా ఎవరు వచ్చినా.. తన అభిప్రాయాలను పంచుకుంటానన్నారు మంత్రి పేర్ని నాని. మూడేళ్లపాటు మీతో కలిసి పనిచేశానని, ఇకపైనా ఏవైనా సమస్యలు ఉంటే కొత్త మంత్రి వద్దకు, అవసరమైతే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ అసోసియేషన్‌తో బహుశా ఇదే తన చివరి సమావేశం కావొచ్చని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story