LIC భద్రత పై పలు సందేహాలు

LIC భద్రత పై పలు సందేహాలు
x
Highlights

జీవితం సురిక్షతంగా వుండాలంటే ప్రతి ఇంట్లో ఎల్.ఐ.సీ పాలసీ వుండాలి. ఇది ఒకప్పటి నానుడి కాని ఇప్పుడు ఎల్.ఐ.సీలో పెట్టుబడులు సురక్షితమేనా అనే ప్రశ్న...

జీవితం సురిక్షతంగా వుండాలంటే ప్రతి ఇంట్లో ఎల్.ఐ.సీ పాలసీ వుండాలి. ఇది ఒకప్పటి నానుడి కాని ఇప్పుడు ఎల్.ఐ.సీలో పెట్టుబడులు సురక్షితమేనా అనే ప్రశ్న వినిపిస్తుంది. ఏన్డీఏ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఎల్.ఐ.సీ భద్రతపై పలు సందేహాలు పెంచుతోంది. ఇంతకీ ఎల్.ఐ.సీ ప్రవైటీకరణపై వైజాగ్ నగర వాసులు ఏం అనుకుంటున్నారు? వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి..?

LIC సంస్థ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రభత్వ రంగం భీమా సంస్థల్లో ప్రధానమైనది. ఎల్.ఐ.సీలో డబ్బులు పెడితే సురక్షితమనే ప్రజల ధీమా కూడా అయితే LIC ని ప్రవైటీ కరణ చేయాలనే ఆలోచనను ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 15 లక్షల ఆదాయం కలిగివున్నవారికి 30 శాతం పన్ను కూడా వేస్తున్నారు. పన్నుల శ్లాబులో మార్పులు తీసుకువచ్చారు. LICలో కొంత వాటాను షేర్ మార్కేట్లో వినియోగించాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. దీంతో అతిపెద్ద ప్రభుత్వ సంస్థ నిర్వీర్యం అయిపోతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఎల్.ఐసీకి 36 లక్షల కోట్ల రుపాయలు ఆస్తులు, మరో 31 లక్షల రుపాయల లైఫ్ ఫండ్స్ వున్నాయి. ఈ పరిస్థితుల్లో LICలో 10 % వాటాలను డిజ్ఇన్వెస్టెమెంట్ చేయడం తగదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యల వలన భవిష్యత్తులో ప్రభుత్వ రంగం సంస్థల భవిత దెబ్బతింటుందని అటువంటి నిర్ణయాలు దేశ ఆర్దిక ప్రగతికి తీవ్రమైన నష్టం కలిగిస్తాయని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచన చేయకపోతే ఉద్యమానికి శ్రీకారం చుట్టక తప్పదని ఉద్యోగులు, సంస్థ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. LIC లాంటి సంస్థల విషయంలో ప్రభుత్వం ప్రవైటీకరణ వైపు అడుగులు వేయడంపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశాఖ నగర వాసులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories