AP News: ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్‌

AP News: మే 1న పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు

Shashank Gullapelli
Published on: 29 April 2024 11:46 AM IST
Pension Into Bank Accounts On May 1 In AP
X

AP News: ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్‌

AP News: పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల కోసం సచివాలయాలకు రానవసరం లేదని, మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని సర్కార్ నిర్ణయించింది. బ్యాంక్ ఎకౌంట్ లేనివారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. మే ఒకటి నుండి 5వ తేదీ లోపు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులతో ఏర్పాట్లు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో విధివిధానాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story