Penna River: అనంతపురం జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా నది

* నది పరివాహక ప్రాంతాల్లోని ముంపు గ్రామాలుకు హెచ్చరికలు * మూడు గేట్ల ద్వారా పెనకచర్ల డ్యాం నుంచి నీటి దిగువకు విడుదల

Shilpa
Updated on: 28 Nov 2021 9:33 AM IST
Penna River Overflowing due to Heavy Rains from One Week in Anantapuam
X

అనంతపురం జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా నది(ఫైల్ ఫోటో)

Penna River: అనంతపురం జిల్లా పామిడి సమీపంలో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గార్లదిన్నె మండలంలోని పెనకచర్ల డ్యాం పూర్తిగా నిండింది. దీంతో అధికారులు మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

అటు పెన్నా నది పరివాహక ప్రాంతాలు, ముంపు గ్రామాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు గార్లెదిన్నె సమీపంలోని పెన్నా నదికి పదేళ్ల తర్వాత జలకళ వచ్చిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Shilpa

Shilpa

Next Story