Pawan Kalyan: వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదనేది నా అభిప్రాయం

Pawan Kalyan: చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిసి మద్దతు ఇచ్చాను

Shekhar G
Published on: 6 Oct 2023 7:36 PM IST
Pawan Once Again Made Key Comments On Alliances
X

Pawan Kalyan: వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదనేది నా అభిప్రాయం

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మేము ఎన్డీయేలోనే ఉన్నామని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. 2014 తరహాలోనే 2024 ఎన్నికలలో పొత్తులు ఉండాలనేది నా ఆకాంక్ష అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదనేది నా అభిప్రాయమన్నారు. చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిసి మద్దతు ఇచ్చానని పవన్‌ తెలిపారు. కేంద్ర పెద్దలను సంప్రదించకుండా పొత్తు ప్రకటించనని తెలిపారు. ఇప్పటికై వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేది నా అభిమతమన్నారు. మాతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుందని ఇప్పటికీ భావిస్తున్నామని పవన్‌ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story