నడ్డా త్వరగా కోలుకోవాలి : పవన్ కళ్యాణ్

అందులో భాగంగానే తాజాగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడ్డా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నడ్డా త్వరగా కోలుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు.

Krishna
Published on: 14 Dec 2020 5:52 PM IST
నడ్డా త్వరగా కోలుకోవాలి : పవన్ కళ్యాణ్
X

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. పశ్చిమబెంగాల్ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత నడ్డాలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీనితో ప్రస్తుతం ఆయన హోమ్ ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నానని తెలిపారు. అయితే అయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నేతలు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడ్డా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నడ్డా త్వరగా కోలుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు. అటు ఇప్పటికే పలువురు బీజేపీ మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.


Krishna

Krishna

Next Story