Pawan Kalyan: ఏపీ పరిషత్ ఎన్నికల్లో జనసేన విజేతలకు పవన్ అభినందనలు

* పరిషత్ ఎన్నికల్లో బలమైన పోరాటం చేశాం * ఇప్పటి వరకు 177 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాలు కైవసం

Sandeep Reddy
Updated on: 20 Sept 2021 3:45 PM IST
Pawan Wished the Janasena Winners in AP Parishad Elections
X

 ఏపీ పరిషత్ ఎన్నికల్లో జనసేన విజేతలకు పవన్ అభినందనలు(ఫోటో-ది హన్స్ ఇండియా)

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో జనసేన విజేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల మేరకు 177 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాలను జనసేన అభ్యర్ధులు గెలుచుకున్నట్టు తెలుస్తోందన్నారు. పార్టీ తరఫున విజయం సాధించిన అభ్యర్ధులందరికీ జనసేన, జనసైనికుల, నాయకులందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయి, ఏ నేపథ్యంలో జరిగాయి అన్న అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తన దగ్గర ఉందన్నారు పవన్.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story