Pawan Kalyan: కాసేపట్లో విస్సన్నపేటలో పర్యటించనున్న పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: మంత్రి అమర్నాథ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న భూముల్లో పవన్‌ పర్యటన

Shekhar G
Published on: 14 Aug 2023 12:54 PM IST
Pawan Kalyan Will Visit Vissannapeta
X

Pawan Kalyan: కాసేపట్లో విస్సన్నపేటలో పర్యటించనున్న పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: కాసేపట్లో అనకాపల్లి జిల్లా విస్సన్నపేటలో వారాహి విజయయాత్రలో భాగంగా.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. మంత్రి అమర్నాథ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న భూముల్లో జనసేనాని పర్యటించనున్నారు. ఓ వైపు మంత్రి, ఆయన అనుచరుడు 600 ఎకరాలను.. రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్‌గా మారుస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మరోవైపు భూమిని మంత్రి అమర్నాథ్‌ కబ్జా చేశారని జనసేన ఆరోపిస్తోంది. 120 అడుగుల రోడ్‌ కోసం కొండలను పిండి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఆ భూముల్లో పవన్‌ పర్యటిస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Shekhar G

Shekhar G

Next Story