నేడు కాకినాడకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: మూడు రోజుల పాటు కాకినాడలో సేనాని పర్యటన

Jyothi
Published on: 28 Dec 2023 10:26 AM IST
Pawan Kalyan Will Visit  Kakinada
X

నేడు కాకినాడకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: నేడు కాకినాడకు వెళ్లనున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. మూడు రోజుల పాటు కాకినాడలో ఆయన పర్యటించనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన నేతలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన అభ్యర్థుల బలాబలాలపై సమీక్షించనున్నారు పవన్‌. ఇప్పటికే అభ్యర్థుల పనితీరుపై వేర్వేరుగా సర్వేలు చేయించిన పవన్‌.. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించనున్నారు. అభ్యర్థుల జాబితాపై ఒక క్లారిటీకి రానున్నారు జనసేనాని. ఇక.. జనసేన పార్టీ పిఠాపురం ఇన్‌చార్జ్‌ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ నివాసంలో పవన్‌ బస చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story