Pawan Kalyan: విజయవాడలో ఓటు వేయనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan will cast his vote in Corporation Elections in Vijayawada
x

ఫైల్ ఇమేజ్


Highlights

Pawan Kalyan: రేపు జరిగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటు వేయనున్నారు

Corporation Elections: రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా భావించే విజయవాడ పైనే అందరి దృష్టీ నిలిచింది. రేపు చివరి దశగా ఏపీ వ్యాప్తంగా పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఓటు వేయనున్నారు. పవన్ కళ్యాణ‌్ పటమటలంకలోని కొమ్మ సీతారామయ్య జడ్పీ బాలికల హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియాలో వెల్లడించింది.

రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలతో పాటు విజయనగరం, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుతున్నాయి. రేపు జరిగే ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఈ నెల 14 తేదీన జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories