ఢిల్లీ బయల్దేరిన జనసేన చీఫ్‌ పవన్‌కల్యాణ్.. ప్రధాని మోడీ, అమిత్‌షాను కలిసే ఛాన్స్

ఢిల్లీ బయల్దేరిన జనసేన చీఫ్‌ పవన్‌కల్యాణ్.. ప్రధాని మోడీ, అమిత్‌షాను కలిసే ఛాన్స్
x
Highlights

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హస్తిన టూర్‌కు బయల్దేరారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రులను కూడా పవన్‌...

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హస్తిన టూర్‌కు బయల్దేరారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రులను కూడా పవన్‌ కలిసే ఛాన్స్‌ ఉంది. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను కేంద్ర పెద్దలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణంపై చర్చించనున్నట్లు సమాచారం. అవసరమైతే ప్రధాని మోడీ, అమిత్ షాలను కలుస్తానని గతంలోనే ప్రకటించిన వ్యాఖ్యల నేపధ్యంలో పవన్ ఢల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఉదయం మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని జనసేనాని ప్రారంభించి.. భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన హస్తినకు వెళ్లడంపై ఆసక్తి రేపుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories