తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
x
పవన్ కళ్యాణ్
Highlights

ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుందని తన చిన్నతనంలో నేర్చుకున్న పాఠాన్ని త్రికరణశుద్ధిగా నేటికి పాటిస్తున్నానని జనసేన అధినేత పవన్...

ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుందని తన చిన్నతనంలో నేర్చుకున్న పాఠాన్ని త్రికరణశుద్ధిగా నేటికి పాటిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాయలసీమకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పవన్ కళ్యాణ్ కు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మూడు దశాబ్దాల క్రితం తిరుపతిలో ఆయన యోగాభ్యాసం నేర్చుకున్న జ్ఞాపకాలని‌ గుర్తు చేసుకున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామి వేడుకున్నట్లు పవన్ మీడియాకు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories